Income Tax | న్యూఢిల్లీ, జూలై 24: వ్యక్తిగత పన్నుల విధానాన్ని పాత, కొత్త అంటూ వర్గీకరించిన మోదీ సర్కారు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను మంగళవారం ప్రకటించిన తాజా బడ్జెట్లోనూ తాము ఇష్టపడి తెచ్చిన కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చలేకపోయింది. చివరకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.75,000 మార్చినా ఫలితం మాత్రం శూన్యమే. ఉదాహరణకు మహేశ్ వయసు 45 సంవత్సరాలు. నెలకు రూ.15 లక్షల వార్షిక ఆదాయం ఉన్నది. నెలకు రూ.8,000 అద్దెతోపాటు, మరో రూ.20,000 హోమ్ లోన్ ఈఎంఐ చెల్లిస్తున్నాడు. అప్పుడు మహేశ్ పన్ను సహిత ఆదాయం ఎంత? దానికి చెల్లించాల్సిన పన్ను ఎంత? అన్నది ఒక్కసారి చూస్తే..
మొత్తం ఆదాయం : 15 లక్షలు
స్టాండర్డ్ డిడక్షన్ : 75 వేలు
పన్ను సహిత ఆదాయం : 14,25,000
పన్ను లెక్కింపు ఇలా..
3 లక్షల వరకు : పన్ను లేదు
3-7 లక్షలు : 20 వేలు (4 లక్షలపై 5%)
7-10 లక్షలు : 30 వేలు (3 లక్షలపై 10%)
10-12 లక్షలు : 30 వేలు (2 లక్షలపై 15%)
12-15 లక్షలు : 45 వేలు (2.25 లక్షలపై 20%)
నికర పన్ను : 1,25,000
ఆరోగ్య, విద్య సెస్సు: 5 వేలు (నికర పన్నుపై 4%)
మొత్తం చెల్లించాల్సినది: 1,30,000
మొత్తం ఆదాయం: 15 లక్షలు
స్టాండర్డ్ డిడక్షన్: 50 వేలు
హెచ్ఆర్ఏ మినహాయింపు: 1,20,000
గృహ రుణంపై వడ్డీ: 1,44,000
సెక్షన్ 80సీ మినహాయింపు: 1,44,000
పన్ను సహిత ఆదాయం: 10,42,000
పన్ను లెక్కింపు ఇలా..
2.5 లక్షల వరకు పన్ను లేదు
2.5-5 లక్షలు: 12,500 (2.5 లక్షలపై 5%)
5-10 లక్షలు: లక్ష రూపాయలు (5 లక్షలపై 20%)
10 లక్షలపైన: 12,600 (42 వేలపై 30%)
నికర పన్ను: 1,25,100
ఆరోగ్య, విద్య సెస్సు: 5,004 (నికర పన్నుపై 4%)
మొత్తం చెల్లించాల్సినది: 1,30,104
