హైదరాబాద్, సెప్టెంబర్ 3: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలంగాణ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా జీ రత్న కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఇండియన్ టెలికం సర్వీసెస్(ఐటీఎస్) 1988 బ్యాచ్‌కు చెందిన ఆయనకు టెలికం రంగంలో 34 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది.
వరద బాదితులకు ఎయిర్టెల్ ఆఫర్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 3: ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్.. తెలుగు రాష్ర్టాల్లో వరదబాదితులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రీపెయిడ్ వినియోగదారుల కాలపరిమితిని మరో 4 రోజులు పొడిగించిన సంస్థ.. పోస్ట్‌పెయిడ్ వినియోదారులు తమ బిల్లుల చెల్లింపుల గడువును 7 రోజులు పొడిగించింది. అలాగే వై-ఫై సేవలు పొందుతున్న వారికి మరో నాలుగు రోజులు గడువిచ్చింది.