ముంబై, ఆగస్టు 15: దేశీయ రోడ్లపై మరో అంతర్జాతీయ మోటార్‌సైకిల్ బ్రాండ్ దూసుకుపోవడానికి సిద్ధమైంది. మహీంద్రా గ్రూపు నిర్వహిస్తున్న ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్ఏ తన తొలి మోటార్‌సైకిల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. 652 సీసీ సామర్థ్యంతో రూపొందించిన గోల్డ్ స్టార్ 650 మాడల్ ధర రూ.2.99 లక్షలు. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ప్రపంచంలో అతి పురాతన మోటార్‌సైకిల్ సంస్థయైన బిర్మింఘమ్ స్మాల్ ఆర్మ్స్ కంపెనీ(బీఎస్ఏ)ను తొమ్మిదేండ్ల క్రితం మహీంద్రా గ్రూపు కొనుగోలు చేసింది. ఇప్పటికే ఈ సంస్థ దేశీయంగా జావా, యెజ్డీ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తున్నది. దీంట్లోభాగంగా బ్రిటన్‌లో 2021లో విడుదల చేసిన బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మాడల్ ఇప్పటికే టర్కీ, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌ల్లో విక్రయిస్తున్న ఈ బైకును తాజాగా దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. అంతర్జాతీయ బ్రాండ్‌గా వెలుగొందుతున్న బీఎస్ఏ బ్రాండ్‌ను భారత్‌కు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. భవిష్యత్తులో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ మార్కెట్లో కూడా ఈ బ్రాండ్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు.