హైదరాబాద్, సెప్టెంబర్ 28: రెన్యువబుల్ ఎనర్జీ ప్లాట్‌ఫాంలో సేవలు అందించడానికి బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్లు జతకట్టాయి. ఇరు సంస్థలకు ఇది రెండో జాయింట్ వెంచర్ కావడం విశేషం. తెలంగాణతోపాటు ఏపీ, ఇతర రాష్ర్టాల్లోనూ ఈ జాయింట్ వెంచర్లో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నాయి.
దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్టుల కోసం 845 మిలియన్ డాలర్ల(రూ.7 వేల కోట్లు) మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించిన బ్రూక్‌ఫీల్డ్ దీంట్లోభాగంగానే దక్షిణాదిలో పలు ప్రాజెక్టులను నిర్మించబోతున్నది. ఈ సందర్భంగా యాక్సిస్ ఎనర్జీ గ్రూపు సీఎంఈ కే రవి కుమార్ రెడ్డి మాట్లాడుతూ..గడిచిన ఐదేండ్లుగా బ్రూక్‌ఫీల్డ్‌తో కలిసి పనిచేస్తున్నట్టు, ఈ జేవీలో మరో అతిపెద్ద పవన, సౌర విద్యుత్ ప్లాంట్లు నిర్మించబోతున్నట్టు చెప్పారు.