న్యూఢిల్లీ, మే 5: బేకరీ ఉత్పత్తుల సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్ రూ.557.60 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2022 జనవరి-మార్చి మధ్యకాలంలో నమోదైన రూ.377.95 కోట్ల లాభంతో పోలిస్తే 47.5 శాతం పెరిగింది.
ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.18 శాతం పెరిగి రూ.4,079.55 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.