హైదరాబాద్, జనవరి 8: రియల్టీ సంస్థ బ్రీగ్రేడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ హైదరాబాద్‌లో హౌజింగ్, కమర్షియల్ ప్రాజెక్టును నిర్మించబోతున్నది. రూ.4,500 కోట్ల పెట్టుబడితో పది ఎకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టు వచ్చే నాలుగేండ్లలో పూర్తికానున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ మైసోర్ తెలిపారు.
45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో 25 లక్షల చదరపు అడుగుల్లో లగ్జరీ హోమ్స్‌ను, 20 లక్షల చదరపు అడుగుల్లో కమర్షియల్ టవర్, 6 లక్షల చదరపు అడుగుల్లో మాల్, 10 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీస్ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.