మోసపూరిత ఖాతాల ప్రకటనపై బ్యాంకర్లకు ఎదురుదెబ్బ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్లపై బాంబే హైకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది.
- ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్లపై బాంబే హైకోర్టు స్టే
ముంబై, జూన్ 19: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్లపై బాంబే హైకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. దీంతో ఎటువంటి విచారణ లేకుండానే ఇకపై బ్యాంకులు ఏ ఖాతానూ మోసపూరిత ఖాతా అని ప్రకటించకుండా అడ్డుకున్నైట్టెంది. జెట్ ఎయిర్వేస్ మునుపటి ప్రమోటర్లు నరేశ్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్సహా మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ గౌతమ్ పటేల్, జస్టిస్ నీలా గోఖలేతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే పైవిధంగా స్టే ఇచ్చింది. సెప్టెంబర్ 11దాకా ఇది వర్తిస్తుందన్నది. ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్లు అన్యాయంగా ఉన్నాయని, ఏ ప్రాతిపదికన రుణగ్రహీతల ఖాతాలను బ్యాంకులు మోసపూరిత ఖాతాలుగా తేల్చుతున్నాయని పిటిషనర్లు ప్రశ్నించారు. కాగా, సెప్టెంబర్ 7,8 తేదీల్లో ఈ కేసు మళ్లీ విచారణకు రానున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

