హైదరాబాద్, మార్చి 18: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా తన డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం పెంచింది. దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లతోపాటు ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈ టర్మ్ డిపాజిట్లపై కూడా వడ్డీరేటును పావు శాతం సవరించింది. రూ.2 కోట్ల లోపు ఉన్న టర్మ్ డిపాజిట్లకు మాత్రం ఈ వడ్డీరేటు పెంపు వర్తించనున్నదని పేర్కొంది. వీటితోపాటు బరోడా ట్యాక్స్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్లు, బరోడాఅడ్వాంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీని పెంచింది. గతేడాది నవంబర్లో ఎఫ్డీలపై 100 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్..ఆ మరుసటి నెలలో 65 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో మూడేండ్ల నుంచి ఐదేండ్ల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 6.25 శాతం నుంచి 6.50 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 6.90 శాతం నుంచి 7.15 శాతానికి సవరించింది. అలాగే ఐదేండ్ల నుంచి 10 ఏండ్లలోపు ఎఫ్డీలపై వడ్డీని 6.50 శాతానికి పెంచిన బ్యాంక్… సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది.