BMW R1300 GS | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ తన బీఎండబ్ల్యూ ఆర్1300 జీఎస్ అడ్వెంచర్ మోటారు సైకిల్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.20.95 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ట్రయంఫ్ టైగర్ 1200 (Triumph Tiger 1200), డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 (Ducati Multistrada V4), హార్లీ డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 స్పెషల్ (Harley Davidson Pan America 1250 Special) మోటారు సైకిల్ కంటే చౌక. లైట్ వైట్, ట్రిపుల్ బ్లాక్ 1, ట్రిపుల్ బ్లాక్ 2, జీఎస్ ట్రోఫీ, ఆప్షన్ 719 ట్రముంతానా వేరియంట్లలో లభిస్తుంది. ట్రయంప్ టైగర్ 1200 కంటే రూ.1.76 లక్షలు, డుకాటీ మల్టీస్ట్రాడ వీ4 తోపాటు హార్లీ డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 స్పెషల్ కంటే ఈ బైక్ రూ.3.69 లక్షలు తక్కువ ధరకు లభిస్తుంది. ఈ నెలాఖరు నుంచి మోటారు సైకిళ్ల డెలివరీ ప్రారంభం అవుతుంది.
న్యూ 1300సీసీ, లిక్విడ్ కూల్డ్, ఫ్లాట్ ట్విన్ బాక్సర్ ఇంజిన్‌తో వస్తోంది బీఎండబ్ల్యూ ఆర్1300 జీఎస్ అడ్వెంచర్ మోటారు సైకిల్. ఈ ఇంజిన్ 7750 ఆర్పీఎం వద్ద 145 పీఎస్ విద్యుత్, 6500 ఆర్పీఎం వద్ద 149 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఫ్రంట్‌లో 190 ఎంఎం వీల్ ట్రావెల్‌తోపాటు బీఎండబ్ల్యూ మోటరాడ్స్ ఈవీవో టెలీలివర్, 200 ఎంఎం వీల్ ట్రావెల్‌తోపాటు ఈవీఓ పారా లెవల్ రేర్ సస్పెన్షన్ ఉంటాయి.
4-పిస్టన్ రాడికల్ కాలిపర్స్‌తోపాటు ట్విన్ 310 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రేర్‌లో 2-పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్ తోపాటు సింగిల్ 285 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉంటాయి. 19 లీటర్ల ఫ్యుయల్ ట్యాంక్, టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఎకో, రెయిన్, రోడ్, ఎండురో రైడింగ్ మోడ్స్‌లో ప్రయాణించొచ్చు. హీటెడ్ గ్రిప్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, న్యూ ఎక్స్-షేప్డ్ ఎల్ఈడీ హెడ్ లైట్ ఉంటుంది.