BMW 6 Series Gran Turismo M Sport | ప్రముఖ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి 6-సిరీస్ గ్రాన్ టురిస్మో ఎం స్పోర్ట్ సిగ్నేచర్ (BMW 6 Series Gran Turismo M Sport Signature) కారును ఆవిష్కరించింది. చెన్నై యూనిట్లో తయారైన ఈ కారు రూ.75.90 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
6-సిరీస్ గ్రాన్ టురిస్మో ఎం స్పోర్ట్ సిగ్నేచర్ (BMW 6 Series Gran Turismo M Sport Signature) కారు 2-లీటర్ల 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ (బీఎండబ్ల్యూ ట్విన్ పవర్ టర్బో టెక్నాలజీతో) వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 258 హెచ్‌పీ విద్యుత్, 400 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 8-స్పీడ్ స్టెప్ ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ తో అందుబాటులోకి వస్తున్నది. కేవలం 6.5 సెక్లనలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్లడం దీని స్పెషాలిటీ. కంఫర్ట్, కంఫర్ట్ +, స్పోర్ట్, ఎకో ప్రో, అడాప్టివ్ రైడింగ్ మోడ్స్‌లో లభిస్తుంది.
మినరల్ వైట్, టాంజానైట్ బ్లూ, స్క్రై స్క్రాపర్ గ్రే, కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బీఎండబ్ల్యూ లేజర్ లైట్, స్లోప్ లైక్ రూఫ్ లైన్, ఎల్ఈడీ రేర్ లైట్, ఫ్రీ ఫామ్ క్రోమ్ ప్లేటెడ్ టెయిల్ పైప్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ సీట్స్, పనోరమిక్ సన్ రూఫ్, అంబియెంట్ లైటింగ్ విత్ సిక్స్ డిమ్మబుల్ డిజైన్స్, హార్మాన్ కార్డోన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 16 స్పీకర్ సిస్టమ్ విత్ వూఫర్స్, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రోప్లేటెడ్ కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టుబుల్ సన్ బ్లైండ్స్ తదితర ఫీచర్లు జత చేశారు.
ఇంకా బీఎండబ్ల్యూ లైవ్ కాక్ పిట్ ప్రొఫెషనల్ విత్ బీఎండబ్ల్యూ ఆపరేటింగ్ సిస్టమ్ 7.0, 3డీ నేవిగేషన్, 12.3- అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్, 12.3 అంగుళీల కంట్రోల్ డిస్ ప్లే, రెండు 10.25 -అంగుళాల టచ్ స్క్కీన్ మానిటర్స్ విత్ ఫుల్ హెచ్డీ టెక్నాలజీ రేర్ సీట్ ఎంటర్టైన్మెంట్ ప్రొఫెషనల్ ఫీచర్లు ఉన్నాయి.
సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, అటెంటివ్ నెస్ అసిస్టెన్స్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్‌తోపాటు ఏబీఎస్ విత్ బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్సియల్ లాక్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సర్లు, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ మౌటింగ్, ఎమర్జెన్సీ స్పేర్ వీల్ ఉంటాయి.