Bluj Aerospace | హైదరాబాద్, అక్టోబర్ 25: నిట్టనిలువున పైకేగిరే విమానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నది రాష్ర్టానికి చెందిన బ్లూజే ఏరో సంస్థ. హైదరాబాద్‌కు సమీపంలోని నాదర్గుల్ ఎయిర్ఫిల్డ్లో ఈ విమానాన్ని ప్రదర్శించింది సంస్థ. ప్రస్తుతం ట్రయిల్ దశలో ఉన్న ఈ మానవ రహిత విమానాన్ని వచ్చే రెండేండ్లలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ కో-ఫౌండర్ ఉత్తమ్ కుమార్ తెలిపారు.
పూర్తిగా బ్యాటరీతో నడిచే ఈ విమానం సింగిల్ చార్జింగ్‌తో 300 కిలోమీటర్లు, 100 కిలోల సామాగ్రిని తీసుకుపోనున్నదన్నారు. చిన్న స్థాయి నగరాల మధ్య లాజిస్టిక్ సేవలు అందించడానికి ఈ విమానం సరైనదని, ముఖ్యంగా మెడికల్, ఇతర అత్యవసర విభాగాలకు సరైనదని చెప్పారు.