న్యూఢిల్లీ, మే 20: ప్రముఖ డీప్ ఫ్రీజర్ల తయారీ సంస్థ బ్లూస్టార్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. కమర్షియల్ రిఫ్రిజిరేషన్ బిజినెస్ నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో వీటి సామర్థ్యాన్ని రెండు రెట్లు పెంచడానికి సరికొత్త యూనిట్‌ను రూ.130 కోట్లతో మహారాష్ట్రలో యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం ఈ యూనిట్ 2 లక్షల డీప్ ఫ్రీజర్లు, లక్ష స్టోరేజ్ వాటర్ కూలర్ల కెపాసిటీ కలిగివున్నది. ప్రస్తుతం భారత్‌లో కమర్షియల్ రిఫ్రిజిరేటర్ల మార్కెట్ విలువ రూ.5 వేల కోట్ల స్థాయిలో ఉండగా, వీటిలో 35 శాతం డీప్ ఫ్రీజర్ల మార్కెట్ కలిగివున్నది.