న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: బిట్‌కాయిన్ విలువ 19వేల డాలర్ల దిగువకు పడిపోయింది. సోమవారం ట్రేడింగ్‌లో 6 శాతానికిపైగా క్షీణించింది. దీంతో 18,830 డాలర్ల వద్దకు దిగజారింది. ఈ ప్రభావం మొత్తం క్రిప్టోకరెన్సీల ధరల్నీ తాకింది.
ఈ క్రమంలోనే ఈథర్ సైతం 10 శాతానికిపైగా నష్టాన్ని చవిచూసింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు భారీగా పెరగబోతున్నాయన్న అంచనాలే క్రిప్టోకరెన్సీలకున్న ఆదరణను తగ్గించేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.