శామీర్‌పేట్, నవంబర్ 24 : దేశంలోనే తొలి సింగిల్‌యూజ్ బయోప్రాసెస్ డిజైన్, సేల్అప్ సౌకర్యం కలిగిన బయోఫార్మా హబ్‌ను మంత్రి డి శ్రీధర్ బాబు సోమవారం శామీర్‌పేట్‌లోని జీనోమ్ వ్యాలీలో ప్రారంభించారు. థర్మో ఫిషర్ సైంటిఫిక్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రం.. అత్యాధునిక బయో రియాక్టర్ సౌకర్యాలను కలిగి ఉన్నది.
ఇక జీనోమ్ వ్యాలీ 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త లోగోను, ప్రధాన ప్రవేశ ద్వారం డిజైన్‌ను కూడా మంత్రి ఆవిషరించారు. కాగా, క్లస్టర్ విస్తరణ కోసం టీజీఐఐసీ ద్వారా రూ.200 కోట్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు.