హైదరాబాద్, నవంబర్ 22: జీవన ఎరువులు, ప్రాణాధార పోషకాల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ బయోఫ్యాక్టర్.. పరిశోధనలో మరో ముందడుగు వేసింది. అనావృష్టి, అతివృష్టిలోనూ మెరుగైన పంట దిగుబడి కోసం అత్యంత సమర్థవంతంగా పనిచేసే ‘బెలోమ్” ఫోలియర్ న్యూట్రిమేషన్ సాంకేతికతకు మరింత సామర్థ్యాన్ని జోడించింది. ప్రపంచంలో తొలిసారిగా మెటబోలైట్ అసిస్టెడ్ మైక్రాన్ సైజ్డ్ (ఏంఏఎంఎస్) న్యూట్రిమేషన్ తయారు చేసి బయోఫ్యాక్టర్ ఇప్పటికే విజయవంతంగా విక్రయిస్తున్నది.
ఆధునీకరించిన బెలోమ్ ఉత్పాదనపై దేశవ్యాప్తంగా సాగించిన పరిశోధనలలో అద్భుత ఫలితాలు వచ్చాయని బయోఫ్యాక్ ఇన్పుట్స్ ఫౌండర్, సీఈవో ఎల్ఎన్ రెడ్డి వెల్లడించారు. మొక్కకు కావలసిన 13 రకాలైన ప్రాణధార పోషకాలు ఏంఏఎంఎస్ విధానంలో ప్రత్యేకించి తయారు చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ వ్యవసాయ భూముల్లో వరి, మొక్కజొన్న, టమాట, వంకాయలు, బంతి, మిర్చి, పత్తి వంటి పంటలపై పరిశోధనలు జరిపామని చెప్పారు.