న్యూఢిల్లీ, డిసెంబర్ 22 : భారత్ బయోటెక్‌తో వ్యాక్సిన్ తయారీదారు బయోఫ్యాబ్రీ జట్టు కట్టింది. టీబీ ఔషధం కోసం సాంకేతిక బదిలీ ఒప్పందం చేసుకున్నది. ఇక ఈ ఒడంబడికతో ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని 70కిపైగా దేశాల్లో ఎంటీబీవీఏసీ ఉత్పత్తి, సరఫరాకు భారత్ బయోటెక్ బాధ్యత వహిస్తుంది.
‘మా ఈ భాగస్వామ్యం అవసరమున్నవారికి ఈ వ్యాక్సిన్‌ను మరింత చేరువ చేస్తుంది’ అని బయోఫ్యాబ్రీ ఆశాభావం వ్యక్తం చేసింది. ట్యూబర్క్యులోసిస్, దాని ప్రభావాలను అరికట్టడానికి కృషి చేస్తున్నామని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు.