BillGates on Musk | ట్విట్టర్‌ను టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ కొనుగోలు చేయడంపై బిలియనీర్ బిల్‌గేట్స్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎలన్‌మస్క్ తీసుకుంటే మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పరిస్థితి దారుణంగా మారుతుందని బిల్‌గేట్స్ హెచ్చరించారు. వాక్ స్వాతంత్య్రానికి స్వర్గధామంగా ట్విట్టర్‌ను రూపుదిద్దుతానంటున్న ఎలన్‌మస్క్.. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో ద్వేష పూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం ప్రచారం కాకుండా ఎలా చర్యలు తీసుకుంటారన్నది మస్క్ వెల్లడించలేదు.
ట్విట్టర్ కోసం గొప్ప ఇంజినీర్లను నియమించగలరు. మస్క్ వద్ద మనీ ఉంది కానీ టెస్లా, స్పేస్ ఎక్స్ మాదిరిగా ట్విట్టర్లోనూ సక్సెస్ సాధించగలమని అంచనా వేయొద్దని ఎలన్‌మస్క్‌కు బిల్‌గేట్స్ సూచించారు. మస్క్ గురించి సానుకూల అంశాలే చెబుతానన్నాడు బిల్‌గేట్స్.
ఆయన ఒకవేళ ట్విట్టర్ పరిస్థితి దారుణంగా మారిస్తే ఫైన్.. బాగుంటుంది. నేను అప్పుడే మాట్లాడతా.. కానీ ఏదో జరుగుతుందని నేను ఊహించి మాట్లాడను అని వాల్‌స్ట్రీట్ జర్నల్‌తో చెప్పారు. 44 బిలియన్ డాలర్ల డీల్‌పై ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్ సొంతంచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణలో ఎలన్‌మస్క్ బిజీబిజీగా గడుపుతున్నారు.