హైదరాబాద్, నవంబర్ 23: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల సంస్థ ఆర్ఏపీ ఎకో మోటర్స్..తాజాగా ‘ఈ-రాజా’ ఆటోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఆటోను రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎలక్ట్రిక్ వాహనాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ఇలాంటి వాహనాల వల్లనే వాతావరణ కాలుష్యం తగ్గనున్నదన్నారు.
ఈవీలను తయారు చేసే సంస్థలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్లు ప్రకటించారు. ఆర్ఏపీ ఎకో మోటర్స్ సీఈవో బాలకృష్ణన్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో ఉన్న ఆర్అండ్డీ సెంటర్లో తయారైన ఈ-రాజా ఆటో సింగిల్ చార్జింగ్‌తో 120 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్లు ప్రయాణించనున్నదన్నారు. నలుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ ఆటో గంటకు 50 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. 3 గంట ల్లో ఈ ఆటో పూర్తిగా చార్జింగ్ అవుతుంది.