హైదరాబాద్, జనవరి 10: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ బిగ్”సి’..సంక్రాంతి పండుగ ఆఫర్లు ప్రకటించింది. వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు అందించడానికి సంస్థ ఎల్లప్పుడూ ముందుంటదని, ఈ పండుగ సందర్భంగా షోరూంలో మొబైల్ కొనుగోలు చేసినవారికి రూ.3 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్‌తోపాటు రూ.4,999 విలువ కలిగిన స్మార్ట్‌వాచ్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు బిగ్”సి’ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి తెలిపారు.
వీటితోపాటు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ.1,10,000 విలువైన హెల్త్‌కేర్‌కు సంబంధించిన ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన వివో ఎక్స్100 సిరీస్ స్మార్ట్ఫోన్తోపాటు రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్లు కూడా తమ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు.