న్యూఢిల్లీ, నవంబర్ 7 : విద్యుత్తు పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) మరో భారీ ప్రాజెక్టును పొందింది. ఎన్టీపీసీ నుంచి రూ.6,650 కోట్ల విలువైన 800 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ కు సంబంధించిన ఆర్డర్ లభించినట్టు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం జరిగిందని వెల్లడించింది. ఈ భారీ ఆర్డర్‌ను వచ్చే 48 నెలల్లో పూర్తి చేయాల్సివుంటుంది.