Best Smartphones | విద్యార్థులు మొదలు గృహిణులు, వ్యాపార వేత్తలు.. అధికారులు.. ఇలా ఒక్కరేమిటి.. వాట్సాప్ మెసేజ్ పంపాలన్నా.. ఏదైనా డేటా డౌన్లోడ్ చేసుకోవాలన్నా.. లేదు ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్లితే సెల్ఫీ దిగాలన్నా.. స్మార్ట్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒక్క క్షణం స్మార్ట్ ఫోన్ లేకుంటే మొత్తం అంధకారం అన్నట్లుగా మారిపోయింది. గతంతో పోలిస్తే మెరుగైన ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్ల కోసం ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు సైతం ఎప్పటికప్పుడు అత్యాధునిక ఫీచర్లు, టెక్నాలజీతో సరికొత్త మోడల్ ఫోన్లతో వస్తున్నాయి. బడ్జెట్ లెవెల్ స్మార్ట్ ఫోన్లు, మిడ్ రేంజ్ స్మార్ట్ ఫొన్లు, ప్రీమియం స్మార్ట్ ఫోన్ల తయారీలో ఆయా సంస్థలు బిజీబిజీగా ఉన్నాయి.
గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఆపిల్, శాంసంగ్లతో పోలిస్తే చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు భారతీయులకు చాలా బాగా కనెక్టయిపోయాయన్న మాటలు వినిపిస్తున్నాయి. భారతీయుల్లో చాలా మంది బడ్జెట్ చెక్ చేసుకుంటూ తమ జీవనం సాగిస్తుంటారు. కుటుంబాల బడ్జెట్కనుగుణంగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తుంటారు. బడ్జెట్ ఫ్రెండ్లీ తర్వాత మిడ్ రేంజ్ కస్టమర్ల కోసం స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు మంచి మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు తెస్తున్నాయి. ఆ జాబితాలో షియోమీ, రియల్మీ, వన్ ప్లస్ ముందు వరుసలో నిలుస్తాయి. ఐక్యూ, మోటరోలా సంస్థలు మార్కెట్ మీద గ్రిప్ సంపాదించేందుకు 2024లో బాగానే కృషి చేశాయి. ప్రతి స్మార్ట్ ఫోన్ బ్రాండ్.. తమ ఫోన్లలో ఏఐ ఫీచర్లను జత చేయడం ఆసక్తికర పరిణామం. రూ.35 వేల లోపు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందామా..!
ఫోన్ పేరు – ధర
రెడ్మీ నోట్ 14 ప్రో+ – రూ.29,999
రెడ్మీ 13 ప్రో+ – రూ.29,999
ఐక్యూ జడ్9ఎస్ ప్రో – రూ.24,999
వన్ ప్లస్ నార్డ్ 4- రూ.29,999
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో – రూ.27,999
దాదాపు 25 ఏండ్లుగా ప్రీమియం స్మార్ట్ ఫోన్ల సెగ్మెంట్లో శాంసంగ్, ఆపిల్ ఐ-ఫోన్లదే ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. కానీ, కొన్నేండ్లుగా వివో వంటి సంస్థలు ప్రీమియం ఫోన్ల జాబితాలోకి వచ్చేశాయి. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సెల్ ఫోన్లతో గట్టి పోటీ ఇస్తోంది. గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో ఫోన్లతోపాటు వివో, వన్ ప్లస్ వంటి సంస్థల నుంచి ప్రీమియం ఫోన్లు వచ్చేస్తున్నాయి. వాటిల్లో ఫోల్డబుల్ ఫోన్లు కూడా ఉండటం గమనార్హం. ప్రీమియం ఫోన్లలో మచ్చుకు కొన్ని చూద్దామా..
ఫోన్ పేరు – ధర
ఆపిల్ ఐ-ఫోన్ 16 ప్రో మ్యాక్స్ – రూ.1,44,900
ఆపిల్ ఐ-ఫోన్ 16 – రూ.79,900
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా – రూ.1,21,999
మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా – రూ.79,999
వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో – రూ.1,59,999
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ – రూ.1,24,999
ఒప్పో ఫైండ్ ఎక్స్8 – రూ.69,999
రియల్మీ జీటీ7 ప్రో – రూ.59,999
వన్ ప్లస్ 12 – రూ.59,999
వివో ఎక్స్200 ప్రో – రూ.94,999