న్యూఢిల్లీ, జూలై 8: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..తొలిసారి లగ్జరీ కార్లను కొనుగోలు చేసేవారి లక్ష్యంగా ఎలక్ట్రిక్ ఎంట్రీలెవల్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.66 లక్షలు. వీటితోపాటు ఐదు సీట్ల ఈక్యూబీ 350 ఎస్యూవీ మాడల్ ధర రూ.77.5 లక్షలు, ఈక్యూబీ 250+(ఏడుగురు) రూ.70.90 లక్షల ధర కలిగిన మాడళ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ఏడాది చివర్లో ఈక్యూఎస్ మేబ్యాక్ ఎస్యూవీ, జీ-క్లాస్ మాడళ్లను సైతం ఈ ఏడాది చివర్లో ఈవీ విభాగంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. వీటి ధర రూ.3 కోట్లు ఉండనున్నట్లు చెప్పారు.