హైదరాబాద్, మే 7: స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ బెనెల్లీ..దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. నూతన టీఆర్కే 2025 సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన మూడు రకాల్లో లభించనున్న ఈ బైకు ప్రారంభ ధర రూ.6.20 లక్షలుగా నిర్ణయించింది.
ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కంఫర్ట్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, స్క్రీన్ మిర్రరింగ్, ట్యూబ్‌లెస్ టైర్లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌తో తయారు చేసిం ది. మూడు రంగుల్లో లభించనున్న టీఆర్కే 502 మాడల్ ధర రూ.6.20 లక్షలు, టీఆర్కే 502 ఎక్స్ మాడల్ రూ.6.70 లక్షలు, టీఆర్కే 502 ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ రూ.6.85 లక్షలకు విక్రయిస్తున్నది. ఈ బైకుపై రెండేండ్లు అన్లిమిటెడ్ కిలోమీటర్ల వ్యారెంటీ, రోజంతా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలు అందిస్తున్నది.