మార్కెట్లోకి మరో ఇండెక్స్ ఈటీఎఫ్ స్కీమ్ వచ్చింది. దీర్ఘకాల పెట్టుబడులు చేసేవారి కోసం మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్.. మార్కెట్లోకి నిఫ్టీ మిడ్‌క్యాప్ 150ని ఈ నెల 24న ప్రవేశపెట్టింది. గత 15 ఏండ్ల చరిత్రలో దాదాపు ఏటా నిఫ్టీ 50, నిఫ్టీ 100 ఇండెక్స్లకన్నా ఎక్కువ రాబడులను నిఫ్టీ మిడ్‌క్యాప్ 150నే ఇచ్చింది. గడిచిన సంవత్సరంలో 46.1 శాతం రాబడిని అందించింది. ఇక ఇండెక్స్‌లు ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే నిఫ్టీ 14.9 శాతం రాబడిని ఇస్తే నిఫ్టీ మిడ్‌క్యాప్ 17 శాతం రాబడిని ఇచ్చింది. కాగా, ఈ 150 ఇండెక్స్‌లో ఉండే మిడ్‌క్యాప్ షేర్లలో వాటి వెయిటేజినిబట్టి ఈ ఫండ్ మదుపు చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమికను పోషిస్తున్న అనేక మిడ్‌క్యాప్ కంపెనీల షేర్లు ఈ ఇండెక్స్‌లో ఉన్నాయి. వాటిలో మదుపు చేయడం ద్వారా అధిక రాబడిని పొందవచ్చుననేది చారిత్రక సత్యం. ఈ ఫండ్ ఎన్ఎఫ్ఓ మార్చి 4న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. ఆ తర్వాత ఎంతైన మదుపు చేయవచ్చు. ఈ ఫండ్‌ను ఏక్తా గాలా నిర్వహిస్తారు.