హైదరాబాద్, జూన్ 24 : దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న సోలార్ ఎనర్జీ కంపెనీల్లో ఒకటైనా ట్రూజన్ సోలార్లోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు వీ చాముండేశ్వరనాథ్ రూ.2.25 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు.
ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, ఎండీ భవాని సురేశ్ మాట్లాడుతూ..వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఈ నిధులను వినియోగించనున్నట్టు చెప్పారు.