ముంబై, నవంబర్ 6: దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్టు హెచ్పీసీఎల్ ప్రకటించింది. ఇందుకోసం నాస్డాక్లో లిైస్టెన బ్యాటరీ మార్పిడి సంస్థ గోగారోతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా దేశవ్యాప్తంగా హెచ్పీసీఎల్కు ఉన్న 21 వేల రిటైల్ అవుట్లెట్లలో బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాలు సమకూర్చనున్నది. ఈ సందర్భంగా గోగారో సీఈవో, ఫౌండర్ హోరేస్ లుకే మాట్లాడుతూ..హెచ్పీసీఎల్తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా దేశీయంగా ద్విచక్ర వాహనాల కోసం వెయ్యి బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.