న్యూఢిల్లీ, ఆగస్టు 6: గడిచిన ఐదేండ్లలో రూ.9.90 లక్షల కోట్ల విలువైన రుణాలపై బ్యాంకులు రైటాఫ్ చేసినట్లు పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2023-24లో రూ.1.70 లక్షల కోట్లను రైటాఫ్ చేసిన బ్యాంక్..అంతక్రితం ఏడాదిలో రూ.2.08 లక్షల కోట్లను రైటాఫ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.
ఈ రైటాఫ్ వల్ల రుణాలు తీసుకున్నవారికి ఎలాంటి ప్రయోజనం లభించదని, తాకట్టు కింద పెట్టిన ఆస్తులను విక్రయించగా వచ్చిన నిధులను రైటాఫ్‌ల కింద జమ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఈ రైటాఫ్ల్లో రూ.1.84 లక్షల కోట్లను బకాయి చేసినట్లు తెలిపారు. అలాగే ఐదేండ్ల క్రితం రూ.8,96,082 కోట్లుగావున్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నిరర్థక ఆస్తులు రూ.4,80, 687 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు.