April Bank Holidays | శనివారం నుంచి నూతన ఆర్థిక సంవత్సరం (2023-24) మొదలైంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తుంటారు. పేమెంట్స్ డిజిటలైజ్ అయినా ఖాతాదారులు అప్పుడప్పుడు బ్యాంకు శాఖలను సంప్రదించాలి. శాఖలకు వెళ్లి బ్యాంకు మేనేజర్లు, ఇతర సిబ్బందితో సంప్రదింపులు జరుపాల్సి ఉంటుంది. బ్యాంకుకు వెళ్లాలనుకున్న రోజు సెలవు ఉందా.. లేదా.. అన్న సంగతి చెక్ చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. తొలి రెండు రోజులు సెలవులతోనే ఏప్రిల్ నెల ప్రారంభం అవుతుంది. ఐదు ఆదివారాలు, రెండో-నాలుగో శనివారంతోపాటు దేశవ్యాప్తంగా 15 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.
వార్షిక బ్యాంకు ఖాతాల ముగింపు సందర్భంగా ఏప్రిల్ ఒకటో తేదీ, రెండో తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు ఇక అంబేద్కర్ జయంతి, బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, మహావీర్ జయంతి, రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ నెలలో మూడు వారాంతాల్లో సెలవులు ఉన్నాయి. తొలుత ఏప్రిల్ ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు వరుసగా మూడు రోజులు, 14-16 తేదీల మధ్య, 21-23 తేదీల మధ్య మూడేసి రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇక ఏప్రిల్ 30 చివరిరోజు ఆదివారం కావడంతో వారాంతపు సెలవుతోనే వచ్చే నెల ముగుస్తుంది.
తేదీ ——- వారం ————– పండుగ —————————- ఏయే రాష్ట్రాల్లో సెలవు
1 ———- శనివారం ———- అకౌంట్స్ క్లోజింగ్ డే ————— పలు రాష్ట్రాల్లో సెలవు
2 ——— ఆదివారం ———- వారాంతపు సెలవు —————– దేశమంతటా సెలవు
4 ——— మంగళవారం —— మహవీర్ జయంతి —————– పలు రాష్ట్రాల్లో సెలవు
5 ——— బుధవారం ———- బాబూ జగ్జీవన్ రాం జయంతి —– దేశమంతటా సెలవు
7 ——— శుక్రవారం ———- గుడ్ ఫ్రైడే ————————– దేశమంతటా సెలవు
8 ——— శనివారం ———– రెండో శనివారం ——————– దేశమంతటా సెలవు
9 ——— ఆదివారం ———- వారాంతపు సెలవు —————– దేశమంతటా సెలవు
14 ——- శుక్రవారం ———– బీఆర్ అంబేద్కర్ జయంతి —— దేశమంతటా సెలవు
15 ——- శనివారం ———— హిమాచల్ దినోత్సవం ———— పలు రాష్ట్రాల్లో సెలవు
———————————- పశ్చిమబెంగాల్ దినోత్సవం
———————————- విషు / బొహగు బిగు
16 ——– ఆదివారం ———- వారాంతపు సెలవు —————– దేశవ్యాప్తంగా సెలవు
18 ——– మంగళవారం —— షాబ్ ఈ- ఖదర్ ——————— జమ్ముకశ్మీర్
21 ——– శుక్రవారం ———- రంజాన్/ గరియా పూజ ————- జమ్ముకశ్మీర్
———————————- జుమాతుల్ విద ——————– త్రిపుర, కేరళ
22 ——– శనివారం ———– నాలుగో శనివారం/ రంజాన్ ——- దేశమంతటా సెలవు
23 ——– ఆదివారం ———- వారంతపు సెలవు —————— దేశమంతటా సెలవు
30 ——– ఆదివారం ———- వారంతపు సెలవు —————– దేశమంతటా సెలవు