July Bank Holidays | ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంక్ లావాదేవీలు జరుపడం నిత్యావసరాల్లో ఒక భాగం. అయితే, బ్యాంకును సంప్రదించాలంటే సంబంధిత శాఖకు వెళ్లడానికి ముందే బ్యాంకులకు సెలవులు ఉన్నాయా.. లేదా.. అన్న సంగతి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. జూలై నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. జూలై 9న బక్రీద్ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. దీంతోపాటు ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. జూలైలో బ్యాంకులకు సెలవుల వివరాలు చూద్దామా.. !
తేదీ —– హాలీడే ———————— ఏ ప్రాంతంలో సెలవు
1 ———- కాంగ్ ————————- భువనేశ్వర్-ఇంఫాల్
3 ———- ఆదివారం ——————- దేశమంతా
7 ———- దైవ పూజలు —————– అగర్తల
9 ———- బక్రీద్& రెండో శనివారం —- దేశమంతా
10 ——— ఆదివారం ——————– దేశమంతా
11 ——— ఈద్ఉల్ అజా —————- జమ్ము అండ్ శ్రీనగర్
13 ——— భాను జయంతి ————— గ్యాంగ్టక్
14 ———- బెన్డయంక్లామ్ ————- షిల్లాంగ్
16 ———- హరెలా ———————– డెహ్రడూన్
17 ———- ఆదివారం ——————- దేశమంతా
23 ———- నాలుగో శనివారం ———– దేశమంతా
24 ———- ఆదివారం ——————- దేశమంతా
26 ———- కెర్పూజ ——————— అగర్తల
31 ———- ఆదివారం ——————- దేశమంతా
ఆయా పర్వదినాలు, ప్రత్యేక కార్యక్రమాల రీత్యా వివిధ రాష్ట్రాల్లో కొన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. జమ్ము, శ్రీనగర్లలో జూలై 9-11 మధ్య మూడు రోజులు సెలవులు. 9న బక్రీద్ సందర్భంగా సెలవు. 10న ఆదివారం, 11న ఈద్ ఉల్ అజా సందర్భంగా బ్యాంకులకు సెలవు.