Bank Holidays | ఇప్పుడు ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు, మహిళలు, విద్యార్థులు.. ఇలా ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నారు. పెన్షనర్లు, కొందరు వ్యక్తులు ఇప్పటికీ బ్యాంకులను సందర్శించి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు. అటువంటి వారంతా ఏప్రిల్ నెలలో బ్యాంకింగ్ కార్యకలాపాలను పరిశీలిస్తూ, తమ ఆర్థిక లావాదేవీల నిర్వహణకు పూనుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండుగలు, జాతీయ సెలవు దినాల్లో బ్యాంకులు పని చేయవు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 16 వరకూ ఐదు రోజుల పాటు బ్యాంకులు పని చేయవు.
భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)తోపాటు అన్ని జాతీయ బ్యాంకులకు ఉగాది (తెలుగు సంవత్సరాది) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సెలవు. ఏప్రిల్ పది లేదా 11న రంజాన్ పర్వదినం సందర్భంగా బ్యాంకులు పని చేయవు. ఏప్రిల్ 13న రెండో శనివారం, ఏప్రిల్ 14న ఆదివారం జాతీయ సెలవు దినాలు. ఏప్రిల్ 16న శ్రీరామ నవమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.
కనుక వివిధ బ్యాంకుల్లో నేరుగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ఖాతాదారులు తమ బ్యాంకు శాఖలకు జాతీయ, రాష్ట్రీయ సెలవు దినాలు ఉన్నాయా? లేదా? అన్న సంగతి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఏప్రిల్ నెలలో బ్యాంకులు 12 రోజుల పాటు మూసి ఉంటాయి.