దస్తురాబాద్, సెప్టెంబర్ 20 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పెర్కపల్లెలో కాంగ్రెస్ సర్పంచ్ బొడకుంట నరేశ్ పేరిట ‘నిధులు లేవు.. అభివృద్ధి ఎలా?’ అని ఆదివారం ఫ్లెక్సీలు వెలిశాయి. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, వీధిదీపాలు, పారిశుధ్యం, చెత్త నిర్వహణ వంటి సమస్యలను చిత్రాలతో ప్రస్తావించారు.
నిధులు రాకపోవడంతో గ్రామాభివృద్ధి కష్టంగా మారిందని, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు.