ముంబై : సీఎన్ఎన్-న్యూస్ 18కు చెందిన సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా (46) ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ముంబై పర్యటనలో ఉన్న ఆమె.. అర్ధరాత్రి 2గంటల తర్వాత అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన దవాఖానకు తరలించారు.
డాక్టర్లు చికిత్స అంది ంచే సమయానికే ఆమె పల్స్ రేట్ పడిపోవడం తో చనిపోయారు. ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, మహారాష్ట్ర సీఎం దేవేం ద్ర ఫడ్నవీస్, స్పీకర్ ఓంబిర్లా సంతాపం వ్యక్తం చేశారు.