‘నేను పౌరుడిని కానా?’
ఎన్నికల సంఘం ప్రస్తుతం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘సర్' ప్రక్రియలో తనకు నోటీసు రావడంపై ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. తాను నమోదైన ఓటరునని, ఎంపీగా ఉన్నప్పటికీ తన పౌరసత్వంపై అనుమానం ఉన్న వ్యక్తిగా ఎలా పరిగణించారని నిలదీశారు.
- దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ‘సర్’ కపిల్ సిబల్ తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ప్రస్తుతం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘సర్’ ప్రక్రియలో తనకు నోటీసు రావడంపై ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. తాను నమోదైన ఓటరునని, ఎంపీగా ఉన్నప్పటికీ తన పౌరసత్వంపై అనుమానం ఉన్న వ్యక్తిగా ఎలా పరిగణించారని నిలదీశారు.
ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తన ఓటు పట్నాలో ఉండేదని, 2004 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో తన పేరు అక్కడి జాబితాలో ఉన్నదన్నారు. బూత్ స్థాయి అధికారి వచ్చినప్పుడు అవసరమైన వివరాలన్నీ అందించానని, ఫారమ్‌పై తన ఫొటోతో పాటు బీఎల్వో సంతకం కూడా ఉన్నదన్నారు. తన ఫోన్ నంబర్ ఎన్నికల అధికారుల వద్ద ఉన్నప్పుడు నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఢిల్లీలో సుమారు 1.45 కోట్ల మంది ఓటర్లలో 63 లక్షల మంది పేర్లు తొలగించారని, దాదాపు 32 లక్షల మందికి నోటీసులు జారీ చేశారని చెప్పారు.
13.40 లక్షల మంది ‘గత సర్‌తో మ్యాపింగ్ కాలేదు’ అనే క్యాటగిరీలో ఉన్నారని తెలిపారు. తల్లిదండ్రుల పేర్లలో వ్యత్యాసం 23 శాతం, వయసులో తేడాలు 6 శాతం కేసులకు కారణమన్నారు. ఎన్నికల సంఘం తన సమస్యను సరిదిద్దగలదని సిబల్ పేర్కొన్నారు. ‘ఈ సారి నేను ఓటు వేయను. ఎన్నికల సంఘం తనను పౌరుడిగా పరిగణించడం లేదని ప్రజలు తెలుసుకోవాలి’ అని కపిల్ సిబల్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

