కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 20 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టడంతో పలు గ్రామాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, డ్రైనేజీల వెంబడి వర్షపు, మురుగు నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామారావుపల్లెలో పిడుగుపాటుతో 12 గొర్రెలు మృతి చెందాయి. వీటి విలువ రూ.1.50 లక్షల వరకు ఉంటుందని గొర్రెల కాపరి చిలివేరి మహేందర్ వాపోయాడు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకున్నాడు. భారీ వర్షం తమ పంటలకు జీవం పోసిందని అన్నదాతలు సంబురపడుతున్నారు.