Bank Strike | బ్యాంకుల సమ్మె ఉపసంహరణ.. 30,31ల్లో సేవలు యధాతథం
Bank Strike | ఈ నెల 30,31 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సమ్మె ఉపసంహరించినట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
Bank Strike | డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. ఐదు రోజుల పని విధానం, ఎన్పీఎస్ రద్దు, వేతన పెంపు సవరణ, అన్ని స్థాయిలో ఉద్యోగుల నియామకాల ప్రక్రియ, తదితర డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చాయి. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్‌తో చర్చలు ఫలప్రదం కావడంతో తాత్కాలికంగా సమ్మె వాయిదా వేసినట్లు తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది.
బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లపై బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ నెల 31న సమావేశం కావడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంగీకరించింది. దీంతో సమ్మె నిర్ణయం వాయిదా వేశామని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. దీంతో ఈ నెల 30,31 తేదీల్లో బ్యాంకులన్నీ యధావిధిగా సేవలందించనున్నాయి.
యూఎఫ్‌బీయూలో అఖిల భారత ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫిడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీఓసీ), నేషనల్ ఆర్గనైజేసన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ఆర్గనైజేషన్ (ఎన్వోబీడబ్ల్యూ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్వోబీవో) సభ్యులుగా ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

