Bank of India | ఆర్బీఐ సవరించిన రెపోరేట్‌కు అనుగుణంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) కొన్ని ఎంపిక చేసిన గడువు గల ఫిక్స్డ్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించింది. గురువారం (2022 జూన్ 23) నుంచి పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు 2.85-5.50 శాతం మధ్య ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిక్ పాయింట్ల వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా 444 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం తీసుకొచ్చింది. 444 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ మీద 5.50 శాతం వడ్డీరేటు అందిస్తున్నది.
ఒక ఏడాది నుంచి 443 రోజులు గల ఫిక్స్డ్ డిపాజిట్‌పై 5.30 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది బ్యాంక్ ఆఫ్ ఇండియా. 444 రోజులనుంచి మూడేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.44 శాతం వడ్డీ అందిస్తున్నది. మూడేండ్ల కంటే ఎక్కువ గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.35 శాతం వడ్డీ అందిస్తున్నది.
సాధారణంగా సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 50 బేసిక్ పాయింట్ల వడ్డీరేటు అదనం. సీనియర్ సిటిజన్లు మూడేండ్లకు పైగా గడువుతో చేసే రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనంగా 25 బేసిక్ పాయింట్లు అదనంగా వడ్డీ అందిస్తున్నది. దీని ప్రకారం మూడేండ్లకు పైగా గడువు గల సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 75 బేసిక్ పాయింట్ల వడ్డీ ఆఫర్ చేస్తున్నది. మెచ్యూరిటీకి ముందే విత్ డ్రాయల్స్ చేసుకున్నా బ్యాంకు పెనాల్టీ వసూలు చేయదు.
ఏడు రోజుల నుంచి 45 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.85 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. 46-179 రోజుల గడువు గల ఎఫ్డీలపై 3.85, 180 రోజుల నుంచి ఏడాది లోపు గడువు గల ఎఫ్డీలపై 4.35, ఏడాది నుంచి 443 రోజుల గడువు గల ఎఫ్డీలపై 5.30, 444 రోజుల టర్మ్ ఎఫ్డీపై 5.50, 445 రోజులు -మూడేండ్ల గడువు గల ఎఫ్డీలపై 5.40 శాతం, మూడేండ్ల నుంచి 10 ఏండ్ల లోపు గడువు గల ఎఫ్డీలపై శాతం 5.35 శాతం వడ్డీ అందిస్తున్నది.