Bank of India : దీపావళి పండుగ ఆఫర్లు ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా
Bank of India : దీపావళి పండుగను పురస్కరించుకుని బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు సంతోషాన్నిచ్చే వార్త అందించింది. గృహ, వాహన రుణాలపై...

(Bank of India) దీపావళి పండుగను పురస్కరించుకుని బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు సంతోషాన్నిచ్చే వార్త అందించింది. గృహ, వాహన రుణాలపై డిస్కౌంట్లను ప్రకటించింది. వడ్డీ రేట్లను తగ్గించడమే కాకుండా ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. బ్యాంక్ తన గృహ రుణాలపై వడ్డీ రేటును 0.35 శాతం తగ్గించింది. తగ్గింపు తర్వాత గృహ రుణ రేటు 6.50 శాతం నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్రత్యేక రేటు 2021 అక్టోబర్ 18 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు వర్తిస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కాకుండా, బ్యాంక్ వాహన రుణాలపై వడ్డీ రేటును 0.50 శాతం తగ్గించింది. దాంతో వాహన రుణాలపై వడ్డీ రేటు 7.35 నుంచి 6.85 శాతానికి తగ్గింది. అలాగే, 2021 డిసెంబర్ 31 వరకు గృహ, వాహన రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయకూడదని బ్యాంక్ నిర్ణయించింది. కొత్త రుణాలు, రుణాల బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే ఖాతాదారులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇలాఉండగా, అనేక బ్యాంకులు కూడా పండుగ సందర్భంగా గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ పండుగ ఆఫర్ల కింద 6.50 శాతం వద్ద గృహ రుణాలను అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.70 శాతం వడ్డీ రేటుతో రుణాలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఎల్ఐసీ 6.66 శాతం, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్ 6.70 శాతం వడ్డీ రేటుతో రుణాలను ఇస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
పడిపోయిన బైడెన్‌పై ప్రజల్లో విశ్వాసం.. కారణమిదేనా?
సూరత్ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి
రైతు ఉద్యమం ముగింపునకు గవర్నర్ కొత్త సలహా.. ఏంటంటే?
బెనజీర్ భుట్టో కాన్వాయిపై ఆత్మాహుతి దాడి
ఉచిత వైఫై తీసుకుంటున్నారా? అయితే, మీ ఫోన్ ప్రమాదంలో పడ్డట్లే..! ఎలాగంటే..
ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్‌లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
Smart Phone Tips | మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ సెట్టింగ్స్ మార్చి చూడండి
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

