చరిత్రలో ఈరోజు : బెనజీర్ భుట్టో కాన్వాయిపై ఆత్మాహుతి దాడి
Today in History : ప్రపంచంలోని శక్తివంతమైన మహిళా నాయకుల్లో ఒకరైన బెనజీర్ భుట్టోను హతమార్చేందుకు కొందరు ఆత్మాహుతి దళ సభ్యులు 2007 లో సరిగ్గా ఇదే రోజున...

(Today in History) ప్రపంచంలోని శక్తివంతమైన మహిళా నాయకుల్లో ఒకరైన బెనజీర్ భుట్టోను హతమార్చేందుకు కొందరు ఆత్మాహుతి దళ సభ్యులు 2007 లో సరిగ్గా ఇదే రోజున బాంబులతో పేల్చుకున్నారు. ఈ ఘటనలో భుట్టో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయితే, ఈ దాడిలో దాదాపు 139 మంది మరణించారు. తొమ్మిదేళ్ల స్వీయ బహిష్కరణ అనంతరం పాకిస్తాన్‌కు తిరిగి రాగానే ఆమెను చంపేందుకు కుట్రపన్ని ఇలా బాంబులతో దాడికి పాల్పడ్డారు. ఇదే ఏడాది డిసెంబర్ 27 న మరోసారి ఆత్మాహుతి దళ సభ్యులు దాడి జరిపినప్పుడు బెనజీర్ చనిపోయారు.
బెనజీర్ భుట్టో 35 ఏండ్ల వయస్సులో పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్‌తో పాటు ఏ ఇస్లామిక్ దేశాలకంతటికీ ఆమె తొలి మహిళా ప్రధాన మంత్రి. ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ఫర్డ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. 1977 లో పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు జరిగి బెనజీర్ తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టోను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించారు. చదువు పూర్తి చేసుకున్న భుట్టో ఇదే ఏడాది పాకిస్తాన్‌కు తిరిగి రాగానే, జియా-ఉల్-హక్ ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు.
1979 లో హత్య కేసులో జుల్ఫికర్ అలీ భుట్టోను ఉరితీశారు. దాంతో పార్టీ వ్యవహారాల నిర్వహణ బాధ్యత బెనజీర్ భుజాలపై పడింది. 1987 లో ఆసిఫ్ అలీ జర్దారీని వివాహం చేసుకున్నది. మరుసటి ఏడాది జియా-ఉల్-హక్ ప్రమాదంలో మరణించడంతో పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలకు తెరలేపారు. బెనజీర్ పార్టీ మెజారిటీ సాధించి, పాకిస్తాన్ మొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
రెండేండ్ల తర్వాత ఆమెను ప్రధానమంత్రి పదవి నుండి తొలగించినప్పటికీ, 1993 లో తిరిగి ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రిగా ఉన్న రెండు పదవీకాలాల్లో ఆమెపై వివిధ ఆరోపణలు వచ్చాయి. అనేక కేసులు కూడా నమోదయ్యాయి. ఫలితంగా ప్రవాస జీవితం గడిపేందుకు బెనజీర్ విదేశాలకెళ్లారు. 2007 లో పాకిస్తాన్‌కు తిరిగి రాగానే హతమార్చేందుకు కుట్ర పన్ని విఫలమయ్యారు. తిరిగి రెండు నెలలకు జరిపిన దాడిలో బెనజీర్ భుట్టో అసువులు బాసారు.ఈ ఘటనలో బెనజీర్తో పాటు 28 మంది మరణించారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2012: మారెట్ అల్-నుమాన్లో సిరియా సైనిక వైమానిక దాడులు, 40 మంది దుర్మరణం
2004: చందనం స్మగ్లర్ వీరప్పన్ హత్య
1998: అణ్వాయుధాల ముప్పును నిలిపేందుకు అంగీకరించిన భారతదేశం, పాకిస్తాన్
1995: కొలంబియాలో నాన్-అలైన్డ్ దేశాల 11 వ శిఖరాగ్ర సమావేశం
1991: సోవియట్ రష్యా నుండి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న అజర్బైజాన్
1985: కవి బెంజమిన్ మోలోయిస్ను ఉరితీసిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం
1931 : ప్రముఖ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ కన్నుమూత
ఇవి కూడా చదవండి..
ఉచిత వైఫై తీసుకుంటున్నారా? అయితే, మీ ఫోన్ ప్రమాదంలో పడ్డట్లే..! ఎలాగంటే..
సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్‌తో సంబంధముంటుందా?
ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్‌లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

