United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
United Nations: మానవ హక్కుల ఆధారంగా రాజకీయ వత్తిళ్లకు పాల్పడరాదు అని, కొన్ని దేశాలను టార్గెట్ చేయరాదు అని భారత్ అభిప్రాయపడింది. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ సమావేశాల్లో భారత ప్రతినిధి బర్కా తామ్రాకర్ తన ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
జెనీవా: మానవ హక్కుల ఆధారంగా రాజకీయ వత్తిళ్లకు పాల్పడరాదు అని, కొన్ని దేశాలను టార్గెట్ చేయరాదు అని భారత్ అభిప్రాయపడింది. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి(United Nations) అసెంబ్లీ సమావేశాల్లో భారత ప్రతినిధి బర్కా తామ్రాకర్ తన ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలో జరుగుతున్న నిరసన పట్ల యూఎన్‌లోని కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు వత్తిడి తెస్తున్నట్లు సుమారు 20 యూఎన్ మానవ హక్కుల నిపుణులు పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ డిప్యూటీ కార్యదర్శి బర్కా తామ్రాకర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మానవ హక్కుల వ్యవస్థలతో భారత్ పనిచేస్తున్నదని, కానీ చర్చ, సంప్రదింపులు, సహకారం ఆధారంగా ఆ సహవాసం కొనసాగాలని, పారదర్శకంగా మార్గదర్శక సూత్రాలను పాటించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
రాజకీయ వత్తిడి తెచ్చేందుకు కానీ దేశాన్ని టార్గెట్ చేసేందుకు కానీ మానవ హక్కులను పరికరంగా వాడుకోరాదు అని ఆమె తన ప్రకటనలో తెలిపారు. మంగళవారం జెనీవాలో జరిగిన యూఎన్ జనరల్ అసెంబ్లీ థార్డ్ కమిటీ మీటింగ్‌లో తామ్రాకర్ ఈ ప్రకటన చేశారు. వర్కింగ్ గ్రూప్ ఆన్ ఎన్ఫోర్స్డ్ డిసప్పియరెన్సెస్ అన్న ఎజెండా అంశంపై మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
#IndiaAtUN
@BarkhaTamrakar, Deputy Secretary @MEAIndia delivered 🇮🇳’s statement at UNGA Third Committee on the Agenda Item “Working Group on Enforced Disappearances” the following :
➡️ Reaffirmed that Article 21, habeas corpus, the NHRC and State Human Rights Commissions, independent media and civil society provide safeguards, transparency and avenues for redressal against enforced disappearances.
➡️ Called enforced disappearances grave human-rights violations and urged prevention, accountability and protection of civil society.
➡️ Noted that 🇮🇳 has signed the Convention on Enforced Disappearances and stressed that law enforcement is bound by law.
➡️ 🇮🇳 called for engagement based on dialogue, cooperation, non-selectivity and transparency.
@PMOIndia @IndianDiplomacy @PIB_India @airnewsalerts @DDNewslive
— India at UN, NY (@IndiaUNNewYork) October 21, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

