Biden rating : జో బైడెన్‌కు తగ్గిపోతున్న ప్రజాదరణ.. కారణం ఆయనేనా?
Biden rating : మెరికాలో ప్రెసిడెంట్ జో బైడెన్‌కు ప్రజామోదం రేటింగ్ తగ్గిపోయింది. ఇది తమ దేశాధ్యక్షుడు లేదా అతడి ప్రభుత్వం గురించి...

(Biden rating) వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రజాదరణ తగ్గిపోతున్నట్లు కనిపిస్తున్నది. ఇది దేశాధ్యక్షుడు లేదా అతడి ప్రభుత్వం గురించి సాధారణ ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారనేది స్పష్టం చేస్తుంది. అక్టోబర్ 6 న కునిపియాక్ యూనివర్సిటీ అధ్యయనకారులు విడుదల చేసిన సర్వే ఫలితాల ప్రకారం, జో బైడెన్ ప్రజాదరణ రేటింగ్ చాలా తక్కువగా ఉన్నది. ప్రజల్లో ఆయనకు 38 శాతం ఆదరణ ఉండగా, ప్రజావ్యతిరేకత రేటింగ్ మాత్రం 53 శాతంగా నమోదైంది. సెప్టెంబర్ నెలలో ప్రజాదరణ 42 శాతం, ప్రజావ్యతిరేకత 50 శాతంగా వచ్చాయి. ఈ రేటింగ్‌ను బట్టి బైడెన్ పట్ల ప్రజల ఆదరణ వేగంగా పడిపోతున్నదని అర్ధమవుతున్నది.
దీనికి ప్రధాన కారణాలేంటని అమెరికన్ మీడియా ప్రశ్నలు లేవనెత్తుతున్నది. జనవరి 20 న అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లోకి బైడెన్ ప్రవేశించి 9 నెలలు గడిచిపోతున్నాయి. కానీ, ఇంతవరకు బైడెన్‌కు ప్రజామోదం రేటింగ్ 50 శాతానికి మించలేదు. బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు చాలా వరకు ప్రశ్నిస్తున్నారు. అధిక పన్ను వసూలు, కొవిడ్ నియంత్రణ, ఆఫ్ఘనిస్తాన్ సమస్యలపై బైడెన్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దాదాపు ప్రతి సమస్యపై మాజీ బాస్ ఒబామాతో బైడెన్ సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాలపై ఒబామాతో క్రమం తప్పకుండా బైడెన్ మాట్లాడుతారని వైట్‌హౌస్ తెలిపింది.
ఒకే వేదికపై ఇద్దరా?
ఐక్యరాజ్య సమితి వాతావరణ శిఖరాగ్ర సమావేశం నవంబర్ 1, 2 తేదీల్లో స్కాట్లాండ్ గ్లాస్గో వేదికగా జరుగనున్నది. పారిస్ వాతావరణ ఒప్పందం ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగింది. విశేషమేంటంటే, బరాక్ ఒబామా కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా వైపు నుంచి పాల్గొననున్నారు. జో బైడెన్, అతని బృందం కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుత, మాజీ అధ్యక్షులు కలిసి శిఖరాగ్రానికి హాజరవుతారా లేదా వారి ఈవెంట్లు వేరుగా ఉంటాయా అనేది ఖచ్చితంగా తెలియరాలేదు.
వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ‘ఫాక్స్ న్యూస్’ ప్రకారం, బైడెన్ ప్రజాదరణ వేగంగా తగ్గుతుండటంతో డెమొక్రాట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తున్నారు. ఒబామాతో సంప్రదింపులు జరుపుతుండటం వల్లనే బైడెన్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గిపోతున్నదని సొంత పార్టీ వాళ్లే బాహాటంగా చెప్పుకుంటుండటం విశేషం.
ఇవి కూడా చదవండి..
సూరత్ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి
రైతు ఉద్యమం ముగింపునకు గవర్నర్ కొత్త సలహా.. ఏంటంటే?
బెనజీర్ భుట్టో కాన్వాయిపై ఆత్మాహుతి దాడి
ఉచిత వైఫై తీసుకుంటున్నారా? అయితే, మీ ఫోన్ ప్రమాదంలో పడ్డట్లే..! ఎలాగంటే..
ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్‌లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

