Bank of England | బ్యాంకు ఆఫ్ ఇంగ్లండ్ (Bank of England) కీలక నిర్ణయం తీసుకున్నది. 16 ఏండ్ల గరిష్ట స్థాయి నుంచి కీలక వడ్డీరేటును తగ్గిస్తూ గురువారం నిర్ణయించింది. గణనీయ స్థాయిలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడంతో వడ్డీరేట్ల తగ్గింపునకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ద్రవ్య పరపతి సమీక్షలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొమ్మిది మంది సభ్యులు గల ద్రవ్య పరపతి సమీక్షా కమిటీలో 5-4 తేడాతో వడ్డీరేట్ల తగ్గింపునకు అంగీకారం కుదిరింది. ఐదు శాతం రుణ ఖర్చులు తగ్గించుకున్నట్లు ప్రకటించింది. కొవిడ్-19 ప్రభావంతో 2020 మార్చి తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కీలక వడ్డీరేట్లు తగ్గించడం ఇదే ప్రథమం.
ప్రస్తుతం కీలక వడ్డీరేటు ఐదు శాతం తగ్గించినా మున్ముందు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బీఓఈ) ద్రవ్య పరపతి సమీక్షా కమిటీ ఆచితూచి ముందడుగు వేస్తుందని బ్యాంకు గవర్నర్ ఆండ్రూ బైలే ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఏడాదికోసారి వడ్డీరేట్లను ఖరారు చేస్తుంది. కానీ 2001లో ద్రవ్యపరపతిని కట్టుదిట్టం చేసిన బీఓఈ.. నాటి నుంచి ఇప్పటి వరకూ మార్చలేదు. గత జూన్ లో జరిగిన బీఓఈ ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగించాలని 7-2 తేడాతో నిర్ణయించారు.
2022 అక్టోబర్ లో 11.1 శాతం వద్ద బ్రిటన్ ద్రవ్యోల్బణం రికార్డైంది. ఇది 41 ఏండ్ల గరిష్టం. గత మే నెల ద్రవ్యోల్బణం రెండు శాతానికి దిగి వచ్చింది. ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాలు, ద్రవ్య విధానంపై బ్రిటన్ ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాల తర్వాత పరిస్థితులను అక్టోబర్ 30న బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్యపరపతి సమీక్షా కమిటీ సమీక్షిస్తుందని తెలుస్తోంది.