Bank of Baroda | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఆధ్వర్యంలో మరో క్రెడిట్ కార్డు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. బీవోబీ అనుబంధ సంస్థ బీఓబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎస్ఎల్) వన్కార్డ్తో కలిసి కో-బ్రాండెడ్ మొబైల్-ఫస్ట్ క్రెడిట్ కార్డు జారీచేస్తామని తెలిపింది. ముఖ్యంగా యువత, టెక్ యూజర్లకు ఈ కార్డులు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుల జారీతోపాటు వాటి నిర్వహణ వ్యవహారాలను బీఎఫ్ఎస్ఎల్ పర్యవేక్షిస్తుంది. అంతర్జాతీయంగా చెల్లుబాటు గల వన్కార్డ్తో కలిసి జారీ చేస్తున్న ఈ క్రెడిట్ కార్డుతో బీవోబీ ఖాతాదారుల డిజిటల్ చెల్లింపులు సులభతరం అవుతాయి. మొబైల్ యాప్ ఆధారంగా వన్కార్డు పని చేస్తుంది. కనుక తన ఖాతాదారులకు క్రెడిట్ కార్డుపై పూర్తి నియంత్రణ ఉండేలా చర్యలు చేపడుతుంది. ఖర్చుతోపాటు రివార్డు పాయింట్లు, చెల్లింపులపై పలు డిజిటల్ సౌకర్యాలు అందిస్తుంది.