న్యూఢిల్లీ, జూలై 31: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను స్టాండలోన్ ప్రతిపాదికన రూ.4,458 కోట్ల నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం వల్లనే అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.4,070 కోట్ల లాభం కంటే 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది.
ఏడాది క్రితం రూ.29,878 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ. 32,116 కోట్లకు ఎగబాకినట్లు బ్యాంక్ సీఈవో, ఎండీ డీ చంద్ తెలిపారు. దీంట్లో వడ్డీల రూపంలో రూ.29,629 కోట్ల ఆదా యం సమకూరింది.