ముంబై, సెప్టెంబర్ 16: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా తమ రిటైల్ రుణగ్రహీతల కోసం గురువారం పలు ఆఫర్లను ప్రకటించింది. గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లను 0.25 శాతం మేర తగ్గించింది. హోమ్ లోన్‌పై వడ్డీరేటు 6.75 శాతంతో, కార్ లోన్‌పై 7 శాతంతో మొదలవుతుందని బ్యాంక్ ఈ సందర్భంగా తెలిపింది. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజునూ తొలగిస్తున్నట్లు చెప్పింది. తక్షణమే రుణాలు మంజూరు కావడం కోసం కస్టమర్లు బీవోబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, వెబ్‌సైట్‌ను వాడుకోవచ్చని బీవోబీ మార్ట్గేజెస్, ఇతర రిటైల్ ఆస్తుల విభాగం జనరల్ మేనేజర్ హెచ్‌టీ సోలంకి ఓ ప్రకటనలో తెలియజేశారు.