Bank Holidays | ఈ ఏడాది 2024 నెలాఖరుకు చేరుకున్నది. త్వరలోనే కొత్త సంవత్సరం 2025 మొదలవనున్నది. 2025 జనవరి బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. కొత్త సంవత్సరం తొలి నెలలో 15రోజుల పాటు బ్యాంకులు మూసే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. రెండు, నాలుగో శనివారాలతో నూతన సంవత్సరం, సంక్రాంతి సెలవులతో పాటు స్థానిక సెలవులు ఆధారంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయని చెప్పింది. మరో వైపు బ్యాంకులు పని చేయకపోయినా మొబైల్, ఇంటర్నెట్, యూపీఐ తదితర బ్యాంకు సేవలు కొనసాగుతాయని తెలిపింది. అయితే, కొన్ని పనుల కోసం తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లక తప్పదు. ముందస్తుగా సెలవుల గురించి తెలుసుకుంటే ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే పనులు పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
జనవరి 1 : నూతన సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
జనవరి 2 : కొత్త ఏడాది సందర్భంగా మిజారంలో, మన్నం జయంతి సందర్భంగా కేరళలో సెలవు.
జనవరి 5 : ఆదివారం సాధారణంగా బ్యాంకులకు సెలవు.
జనవరి 6 : గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా హర్యానా, పంజాబ్లో సెలవు.
జనవరి 11 : శనివారం మిషనరీ డే సందర్భంగా మిజోరాంలో సెలవు
జనవరి 12 : ఆదివారం సందర్భంగా హాలీడే.
జనవరి 14 : మకర సంక్రాంతి సందర్భంగా చాలా రాష్ట్రాల్లో సెలవు.
జనవరి 15 : మాగ్ బిహు సందర్భంగా అసోంలో, తిరువల్లువర్ దినోతవ్సం సందర్భంగా తమిళనాడులో సెలవు.
జనవరి 16 : కనుమ పండుగ సందర్భంగా పలు రాష్ట్రాల్లో హాలీడే.
జనవరి 19 : ఆదివారం సందర్భంగా హాలీడే.
జనవరి 22 : ఇమోయిను సందర్భంగా మణిపూర్లో సెలవు.
జనవరి 23 : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో హాలీడే.
జనవరి 25 : నాల్గో శనివారం సందర్భంగా సెలవు.
జనవరి 26 : ఆదివారం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు.
జనవరి 30 : ఓనమ్ లోసర్ సందర్భంగా సిక్కింలో హాలీడే.