November Bank holidays | కాల గర్భంలో మరో నెల కలిసిపోనున్నది. మరో రెండు రోజుల్లో అక్టోబర్ నెల ముగిసి.. నవంబర్ నెల ప్రారంభం కానున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాలు నిర్వహిస్తుండటం సహజం. లావాదేవీలన్నీ డిజిటల్మయమైనా.. ఖాతాదారులు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది.
ప్రస్తుత స్పీడ్ యుగంలో టైం ఎంతో కీలకం.. కనుక బ్యాంకులకు వెళ్లే రోజు సెలవులు ఉన్నాయా? లేవా? అన్న సంగతి తెలుసుకుంటే.. బ్యాంకింగ్ లావాదేవీలు, వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చిన సెలవుల ప్రకారం 15 రోజులూ సెలవులే. నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి ఆరు సెలవులు.. అదనంగా పండుగలు, గెజిటెడ్, బ్యాంక్ సెలవులు, ప్రాంతీయ, రాష్ట్రాల వారీ సెలవులు కలుపుకుని తొమ్మిది రోజులు బ్యాంకులు పని చేయవు. వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులు ఇలా..
ఈ సెలవు దినాల్లో ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యధాతథం.
నవంబర్ 5: ఆదివారం
నవంబర్ 11: రెండో శనివారం
నవంబర్ 12: ఆదివారం
నవంబర్ 19 : ఆదివారం
నవంబర్ 25: నాలుగో శనివారం
నవంబర్ 26: ఆదివారం.