Bank Holidays | మంగళవారం నుంచి ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు.. ఇవీ కారణాలు!
Bank Holidays | మహావీర్ జయంతితోపాటు వివిధ పర్వ దినాలు, వారాంతపు సెలవులతో బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు.
Bank Holidays | ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తుంటారు. దాదాపు మెజారిటీ ఆన్లైన్ లావాదేవీలు నిర్వహిస్తున్నా.. డాక్యుమెంట్లు సమర్పించడానికి, ఖాతా తెరవడానికి, ఇంటి రుణం తీసుకోవడానికి, ఈ-కేవైసీ సమర్పించినా.. ఒకసారైనా బ్యాంకుల్ని సందర్శించాల్సి వస్తుంది. కనుక బ్యాంకులకు వెళ్లాలనుకున్న రోజు అవి పని చేస్తున్నాయా.. లేదా.. అని ఒకసారి చెక్ చేసుకుంటే.. క్లారిటీ వస్తుంది. ఈ నెల నాలుగో తేదీన మహా వీర్ జయంతి.. మహావీర్ జయంతి సందర్భంగా పలు ప్రైవేట్ బ్యాంకులతోపాటు ప్రభుత్వ బ్యాంకులకు పలు రాష్ట్రాల్లో సెలవు ఉంటుందని ఆర్బీఐ హాలీడే షెడ్యూల్ చెబుతున్నది.
మహావీర్ జయంతి సందర్భంగా గుజరాత్, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛండీగఢ్, తమిళనాడు, రాజస్థాన్, లక్నో, న్యూఢిల్లీ, ఛత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. ఈ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు అని ఆర్బీఐ ప్రకటించింది. మహావీర్ జయంతితోపాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, గుడ్ ఫ్రైడే వరకు సెలవులు ఉన్నాయి.
- మంగళవారం (ఏప్రిల్ 4) మహావీర్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
- ఇక ఏప్రిల్ ఐదో తేదీన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.
- ఈ నెల ఏడో తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా ఐజ్వాల్, బెలాపూర్, బెంగళూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, డెహ్రడూన్, గ్యాంగ్టక్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంఫాల్, కాన్ఫూర్, కొచ్చి, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్పూర్, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురంలలో బ్యాంకులు పని చేయవు.
- ఈ నెల 8న రెండో శనివారం, తొమ్మిదో తేదీన ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

