పూణె, ఫిబ్రవరి 14 : ప్రపంచంలో అత్యంత విలువైన ద్విచక్ర వాహన సంస్థల్లో ఒకటైన బజాజ్ ఆటో.. దేశీయ మార్కెట్లోకి మరో పల్సర్ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాంటి బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్)తో తయారైన పల్సర్ ఎన్ఎస్125 బైకు ధర రూ.1, 06, 739గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా బైకును ఆధునీకరించినట్లు, ముఖ్యం గా ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ చార్జర్ వంటి టెక్నాలజీతో తయారు చేసింది. 125 సీసీ సెగ్మెంట్లో అత్యంత శక్తివంతమైన ఈ బైకు 12 పీఎస్‌ల శక్తినివ్వనున్నది.