న్యూఢిల్లీ, మే 10: బజాజ్ ఫైనాన్స్ తమ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లను పెంచింది. 40 బేసిస్ పాయింట్ల (0.4 శాతం) వరకు పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకున్నది. దీంతో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకమైన 44 నెలల కాలవ్యవధి ఎఫ్డీపై వార్షిక వడ్డీరేటు 8.6 శాతానికి చేరింది.
కాగా, 36 నెలల నుంచి 60 నెలల వరకుండే ఎఫ్డీలపై 60 ఏండ్లలోపు డిపాజిటర్లకు 8.05 శాతం వడ్డీరేటు, ఆపై వయస్కులకు 8.3 శాతం లభిస్తుంది. రూ.5 లక్షలదాకా చేసే కొత్త డిపాజిట్లకైనా, కాలపరిమితి తీరి రెన్యువల్స్కు వచ్చే వాటికైనా సవరించిన వడ్డీరేట్లు వర్తిస్తాయని ఈ సందర్భంగా ఈ బజాజ్ ఫిన్సర్వ్ అనుబంధ సంస్థ స్పష్టం చేసింది.