బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మరీ ఖర్చెక్కువ.. మళ్లీ ధర పెంపు!
చేతక్ ఎలక్ట్రిక్ మరీ ఖర్చెక్కువ} కేవలం నెల రోజుల్లోనే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర మళ్లీ పెంచేసింది బజాజ్ ఆటో. దీంతో బజాజ్ చేతక్...

న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల క్రితం వరకు బజాజ్ చేతక్ స్కూటర్ అంటే ప్రజలు ఎంతో ఇష్ట పడే వారు.. అయితే, టెక్నాలజీ అందుబాటులోకి రావడంతోపాటు వివిధ ద్విచక్ర వాహనాల సంస్థలు పలు మోడల్ వెహికల్స్‌ను ఆవిష్కరించాయి. దీంతో బజాజ్ చేతక్ స్కూటర్ మరుగున పడిపోయింది.. కానీ దాన్ని రీ మోడల్ చేసిన బజాజ్ ఆటో.. ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఆవిష్కరించింది.
నెల రోజుల్లో రెండోసారి పెంపు
అయితే కేవలం నెల రోజుల్లోనే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర మళ్లీ పెంచేసింది బజాజ్ ఆటో. దీంతో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలంటే మీరు అదనంగా రూ.28 వేలు ఖర్చు చేయాల్సిందే.
అర్బన్, ప్రీమియం వేరియంట్లలో చేతక్
బజాజ్ చేతక్ స్కూటర్‌ను ప్రీమియం, అర్బన్ వేరియంట్లలో బజాజ్ ఆటో ఆవిష్కరించింది. ఇప్పుడు పెరగిన ధరతో అర్బన్ వేరియంట్ స్కూటర్ ధర రూ.27,620, ప్రీమియం వేరియంట్ రూ.24,620 పెరిగింది. నెల రోజుల క్రితమే దీని ధర బజాజ్ ఆటో రూ.5000 పెంచేసింది.
ఇలా పెరిగిన చేతక్ ఎలక్ట్రిక్ ధరలు
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ ప్రీమియం వేరియంట్ పాత ధర రూ.1.20 లక్షలు ఉంటే, సవరించిన ధరల ప్రకారం రూ.1.45 లక్షలకు చేరుకున్నది. అర్బన్ వేరియంట్ స్కూటర్ ధర రూ.1.15 లక్షల నుంచి రూ.1.43 లక్షలకు చేరుకుంది. గంటకు 95 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం దీని స్పెషాలిటీ.
బ్యాటరీతో ఇలా ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం
మూడు కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీతో 3.8 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌ను అనుసంధానించారు. దీని గరిష్ఠ ఇంధన సామర్థ్యం 5.5 పీఎస్. ఎకో మోడల్ చేతక్ 95 కిలోమీటర్లు, స్పోర్ట్ మోడ్ స్కూటర్ 85 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది.
దీన్నిచార్జింగ్ చేయడానికి ఐదు గంటల టైం పడుతుంది. బ్యాటరీపై మూడేండ్లు లేదా 50 వేల కి.మీ. వరకు వారంటీని ఇస్తున్నది బజాజ్ ఆటో.
ఇవి కూడా చదవండి..
స్మార్ట్‌గా దోపిడీ.. రూ.5 లక్షలు చోరీ
బ్యాంక్ అలర్ట్ : ఆదివారం ఆర్టీజీఎస్ సేవలకు బ్రేక్!
ఐటీ ఉద్యోగాల జాతర
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
నీట్-2021వాయిదా
దేశంలోకి త్వరలో కొత్తగా 8 బ్యాంకులు
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ విలువ ఎంతంటే!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

